Hyderabad: హైదరాబాద్‌లో ప్రారంభమైన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు.. నేటి నుంచి ఐదు రోజులపాటు ఘనంగా వేడుకలు

UPDATED 11th OCTOBER 2022 TUESDAY 08:40 PM

Hyderabad: హైదరాబాద్ మహా నగరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల ఆలయంలో స్వామివారికి రోజువారీ నిర్వహించే అన్ని రకాల సేవలను భక్తులకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఈ వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు.

టీటీడీ ఆధ్వర్యంలోనే, స్థానిక దాతల సహకారంతో ఈ ఉత్సవాలు కొనసాగుతాయి. స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన శ్రీవారి నమూనా ఆలయంలో ఈ సేవలు నిర్వహిస్తారు. ఉదయం ఆరు గంటలకు సుప్రభాతంతో మొదలైన సేవలు, రాత్రి ఎనిమిదిన్నర గంటలకు స్వామి వారి ఏకాంత సేవతో ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో ఉదయం ఆరు గంటలకు స్వామివారికి సుప్రభాత సేవ, ఆరున్నర గంటల నుంచి ఏడున్నర గంటల వరకు తోమాల సేవ, కొలువు ఉంటాయి. సాయంత్రం పూట కూడా ఈ తోమాల సేవ ఉంటుంది. ఉదయం ఏడున్నర గంటల నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు స్వామి వారికి అర్చన నిర్వహిస్తారు. ఆ తర్వాత నివేదన, శాత్తుమొర ఎనిమిదిన్నర గంటల వరకు కొనసాగుతుంది.

అలాగే శ్రీవారి అష్టదళ పాదపద్మారాధన, వసంతోత్సవం కూడా నిర్వహిస్తారు. మంగళవారం ఉయదం పది నుంచి పదకొండు గంటల వరకు వసంతోత్సవం వైభవంగా జరిగింది. వీటితోపాటు స్వామివారికి సంబంధించి అన్నమయ్య సంకీర్తనలు ఉంటాయి. ఈ నెల 15 వరకు ఈ వేడుకలు జరుగుతాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us