హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 26 డిసెంబర్ 2021: క్రెడిట్ కార్డుపై రివార్డ్ పాయింట్స్ పేరుతో మెసేజ్ రూపంలో లింక్ పంపి ఖాతాలో నగదు మాయం చేశారు సైబర్ నేరగాళ్లు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ బాలానగర్ పరిధిలోని ఐడీపీఎల్‌కు చెందిన సుభాష్‌కు కొటక్ మహీంద్రా బ్యాంకు క్రెడిట్‌కార్డు ఉంది. తన కార్డుకు రివార్డ్ పాయింట్స్ వచ్చాయంటూ మెసేజ్ రూపంలో లింక్ పంపించారు గుర్తు తెలియని వ్యక్తులు. అది నమ్మిన సుభాష్ తన ఖాతాకు సంబంధించిన వివరాలను వారికి తెలిపారు. దాంతో వెంటనే ఖాతా నుంచి రూ.1.11లక్షలు డెబిట్ అయినట్టు మెసేజ్ రావడంతో కంగుతున్న బాధితుడు బాలానగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.







