రేణిగుంట (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. జి.వి.పాలెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ఈ ఉదయం నలుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. వారిలో జి.వి.పాలెం ఎస్సీ కాలనీకి చెందిన గణేష్ (15), యుగంధర్ (14), ధోని (16) గల్లంతు కాగా లిఖిత్ సాయి క్షేమంగా ఒడ్డుకు చేరాడు. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని గల్లంతైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.







