జాతీయ స్థాయి స్టాక్ మైండ్ సీజన్ పోటీల్లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ

UPDATED 28th JULY 2017 FRIDAY 5:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు 18 వ జాతీయస్థాయి స్టాక్ మైండ్ సీజన్-5 పోటీల్లో ప్రతిభ కనబరిచినట్లు బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సెంట్రల్ ఫైనాన్సియల్ లెర్నింగ్ కోసం 18 వ జాతీయస్థాయి స్టాక్ మైండ్ సీజన్ పోటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 18 మంది విద్యార్థులు పలు విభాగాల్లో విజేతలుగా, రన్నర్స్ గా నిలిచారని ఆమె పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఎస్.వి. సాయికృష్ణ, జి.ఎం.ఎస్. ఫణికుమార్, వి. నవీన్ కుమార్, ఆర్. వినాథ, అనుదీప్ వర్మ, వై. హర్షిత్ భార్గవ్ లు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు గెలుపొందినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలను ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. విశాలాక్షి, అధ్యాపకులు అభినందించారు.  
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us