TS News: ఢిల్లీలో అమిత్‌షాతో తెలంగాణ నేతల కీలక భేటీ

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో తెలంగాణ భాజపా ముఖ్యనేతలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ మంత్రులు, ఈటల రాజేందర్‌, డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి తదితరులు అమిత్‌షాతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని అమిత్‌షా ఛాంబర్‌లో జరిగిన ఈ భేటీకి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా హాజరయ్యారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో తెరాస ఆందోళనల దృష్ట్యా అమిత్‌షాతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ విషయంలో తెరాసను ఎదుర్కొనే వ్యూహాలపై రాష్ట్ర నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us