ఆత్రేయపురం (రెడ్ బీ న్యూస్) 1 నవంబర్ 2021 : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరుడు కల్కి అవతారంలో భక్తకోటికి దర్శనమిచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదోరోజైన సోమవారం స్వామి అశ్వ వాహనాధీశుడయ్యారు. అంతకుముందు హోమాలు, వివిధ రకాల పూజలు నిర్వహించారు. ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, గిరిజన సంక్షేమ శాఖ డీఈ వేణుగోపాల్ , అంకంపాలెం ఉప సర్పంచి కరుటూరి విశ్వేశ్వరి తదితరులు పాల్గొన్నారు.







