UPDATED 26th JUNE 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: పట్టణ పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులు, క్రీడాకారులు జాతీయ ఒలెంపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఒలెంపిక్ రన్ నిర్వహించారు. సుమారు రెండు వందల మంది పాల్గొన్న ఈ కార్యక్రమం స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి మఠం సెంటరు వరకూ కొనసాగింది. ఈ ర్యాలీని సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ రన్ లో పాల్గొన్న విద్యార్థులు, క్రీడాకారులకు ప్రశంసాపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, ఎంఇవో వై.వి. శివరామ కృష్ణయ్య, ప్రతిభా విద్యాసంస్థల కరస్పాండెంట్ ప్రకాష్, బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాల హెచ్ఎం యు. సత్యన్నారాయణ, బిబిఆర్ ఉన్నత పాఠశాల హెచ్ఎం శ్రీనివాసరాజు, శ్యాంసుందర్, ఎం.డి.వి. ప్రసాద్, కె. సుబ్రహ్మణ్యం, టి.వి.ఎస్. రంగారావు, కోకో కోచ్ కె. కృపావతి, పిఇటిలు తాళ్ళూరి వైకుంఠం బండారు శ్రీను, ఆశీర్వాదం, సోమేశ్వరరావు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.







