కొత్త సీఈసీగా అచల్‌ కుమార్‌ జ్యోతి నియామకం

UPDATED 4th JULY 2017 TUESDAY 7:00 PM

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం నూతన ప్రధాన అధికారిగా అచల్‌ కుమార్‌ జ్యోతి నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ నసీమ్‌ జైదీ ఈ నెల 6న పదవీ విరమణ పొందనున్నారు. దీంతో అదే రోజు అచల్‌ కుమార్‌ జ్యోతి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు.1975 గుజరాత్‌ ఐఏఎస్ కేడర్‌ చెందిన అచల్‌ కుమార్‌ జ్యోతి అనేక కీలక పదవులు చేపట్టారు. కాండ్లా పోర్ట్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా, సర్దార్‌ సరోవర్‌ నర్మద నిగమ్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరించారు. గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ అచల్‌ కుమార్‌ జ్యోతి విధులు నిర్వహించారు. 2015 మే నెలలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. 64 ఏళ్ల అచల్‌ కుమార్‌ జ్యోతి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిగా ఏడాదిపాటు కొనసాగుతారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us