Updated 24 January 2022 Monday 21:00 PM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో మాస్క్ ధరించని వారిపై ఉక్కుపాదం మోపారు. ఈ ఒక్కరోజే 100 కేసులు నమోదు చేశారు. జనం అధికంగా ఉండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించని వారిపై జరిమానాలు విధించారు. పాన్ షాప్స్, హోటల్స్, టీ స్టాల్ల్స్ తదితర కౌంటర్లలో ఉండి మాస్క్ లు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఇకపై ఈ డ్రైవ్ ప్రతిరోజు కొనసాగుతుందని, దుకాణాల యాజమాన్యాలు, వాటిలో పని చేసే ఉద్యోగులు తప్పకుండా మాస్క్‌లు ధరిస్తూ, కోవిడ్ నిబంధనలు పాటించాలని, కస్టమర్స్‌ని సోషల్ డిస్టెన్స్‌లో ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఎంట్రీ వద్ద శానిటజైర్లు అందుబాటులో ఉంచాలి. నో మాస్క్, నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేయాలని పోలీసుల ఆదేశాలు జారీ చేశారు.







