పెద్దాపురం : పేదప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురం పట్టణం లో అయన సోమవారం పర్యటించారు. ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో ఆరోగ్య పధకాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరికి వైద్య సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అలాగే వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో తాగునీటిని ట్యాంకర్ల సహాయంతో సరఫరా చేయాలన్నారు. పట్టణాభివృద్ధికి ప్రతీ ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. వారం రోజుల్లో పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుం దని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు , వైస్ చైర్మన్ కురుపూరి రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బి. బంగారుబాబు, కమీషనర్ ఏ.వెంకటరావు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాము కౌన్సిల్లర్లు, అధికారులు పాల్గొన్నారు. ,







