రుణాలు లేకుండా ఇళ్ళు నిర్మించాలి

UPDATED 29th MAY 2017 MONDAY 11:45 AM

పెద్దాపురం: అందరికి ఇళ్ళు ( హౌసింగ్ ఫర్ ఆల్) పథకంలో పెద్దాపురం పట్టణంలో నిర్మించనున్న అపార్టుమెంట్లకు లబ్ధిదారులకు బ్యాంకు ఋణం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడితో ఇళ్ళు నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కమీషనర్ బి. శేషాద్రికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భం గా సిపిఎం పట్టణ కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ నగర్ లో 385 చదరపు అడుగుల విస్తీర్ణంలో జి ప్లస్ 2  అపార్టుమెంట్లు కాలనీలో అన్ని మౌలిక వసతులతో కలిపి ఒక్కొక్క అపార్టుమెంట్ కు రూ.1.63 లక్షలు వ్యయం అయిందన్నారు. అందరికి ఇళ్ళు పథకంలో ౩౦౦, 385, 430 చదరపు అడుగుల్లో జి ప్లస్ త్రీ అపార్టుమెంట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారన్నారు. మొదటిది రూ. 6.19 లక్షలు, రెండవది రూ.7.34  లక్షలు, మూడవది రూ. 8.47 లక్షలు అవుతుందని తెలిపారు. మూడు సంవత్సరాల్లో రెండున్నర రెట్లు వ్యయం ఎందుకు పెరిగిందని ఆయన ప్రశ్నించారు. వీటికి కేంద్ర ప్రభుత్వం రూ. మూడు లక్షలు సబ్సిడి ఇస్తున్నందున లబ్ధిదారులు చెల్లించే వాటా సొమ్ముతో వీటిని నిర్మించవచ్చన్నారు. కాని మొదటి కేటగిరిలో రూ.3.18 లక్షలు, రెండవ కేటగిరిలో రూ. 3.84 లక్షలు, మూడవ కేటగిరి లో రూ.4.47 లక్షలు బ్యాంకుల వద్ద లబ్ధిదారులు రుణాలు తీసుకుంటే రుణాలకు వడ్డీలు, వాయిదాలు చెల్లించలేక చివరికి ఫ్లాట్లను అమ్ముకునే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పునరాలోచన చేసి లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు లేకుండా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కౌన్సిలర్ కూనిరెడ్డి అరుణ, నాయకులు సిరిపురపు శ్రీనివాస్, గడిగట్ల సత్తిబాబు, కంచుమర్తి కాటంరాజు తదితరులు పాల్గొన్నారు.  

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us