Samantha: సమంత కొత్త పోస్ట్‌.. ఎదుటివాళ్ల మాటలు పట్టించుకోవద్దు.!

హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 1 జనవరి 2022‌: జీవితంలో ముందుకు సాగాలంటే ఎదుటివాళ్ల మాటలు పట్టించుకోవద్దని నటి సమంత పోస్ట్‌ చేశారు. గతేడాది చైతో వైవాహిక బంధానికి స్వస్తి పలికిన నాటి నుంచి సమంత విమర్శలు ఎదుర్కొంటున్నారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె నూతన సంవత్సర వేడుకల కోసం స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్లారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. జలపాతాల వద్ద ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నట్లు ఆమె దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. దీంతో మరోసారి సమంత పేరు తెరపైకి వచ్చింది. ఆమె షేర్‌ చేసిన ఫొటోలు చూసిన నెటిజన్లు వ్యంగ్యంగా కామెంట్లు చేయడం ప్రారంభించారు. కాగా, నెటిజన్ల కామెంట్లపై సమంత పరోక్షంగా స్పందించారు. మీ గురించి తెలియనివాళ్లు ఎవరు ఏం అనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ‘‘ఎదుటివాళ్లు ఏం ఆలోచిస్తున్నారు, ఏం నమ్ముతున్నారు, ఏం ఆశిస్తున్నారు.. ఇవన్నీ జైల్లో ఊచలాంటివి. వాటి నుంచి విముక్తి పొందాలనుకుంటే.. అవి వాళ్ల మనసు అనే జైలుకు ఉన్న ఊచలని.. మీకు కాదని గ్రహించి ముందుకు సాగిపోవాలి. ఎవరి అభిప్రాయాలు మీ జీవితాన్ని నిర్దేశించలేవు. కాబట్టి, ఎదుటివాళ్ల అభిప్రాయంతో మీకు అవసరం లేదు. కేవలం ‘నిజం’ మాత్రమే ముఖ్యమైనదని నువ్వు భావిస్తే ఎలాంటి ప్రశంసలు వచ్చినా అసంతృప్తి చెందవు. ఈ విషయాన్ని మనస్సుతో అర్థం చేసుకుంటే నువ్వు మరింత స్వేచ్ఛగా ఉండగలవు, నీకు మంచి గుర్తింపూ దొరుకుతుంది’’ అని సమంత ట్వీట్‌ చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us