Prabhas: దీపిక పదుకొణె కోసం ప్రభాస్‌ భారీ లంచ్‌..

హైదరాబాద్‌ (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: భారీ ప్రాజెక్టులతో వరుస సినిమాలు చేస్తూ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు ప్రభాస్(Prabhas). నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న కొత్త చిత్రం ‘ప్రాజెక్ట్‌ కె’(Project K). దీపిక పదుకొణె (Deepika Padukone) కథానాయిక. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్‌, దీపికా పదుకొణెలపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. సైన్స్‌ ఫిక్షన్‌ కథతో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్టు కె’ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. కథ రీత్యా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించేలా ప్రఖ్యాత రామోజీఫిల్మ్‌ సిటీలో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్‌లో చిత్రీకరణ జరిపారు. దీంతో దీపిక పదుకొణెకు సంబంధించి ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తవడంతో ఆమె తిరిగి ముంబయి వెళ్లిపోయారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us