సంగం (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: నెల్లూరు జిల్లా సంగం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ఆటోను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో వాగులో పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 15 మంది ఉన్నట్టు సమాచారం. ఆటోలో ఉన్న వారు వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
ఐదుగురి కోసం గాలిస్తున్నాం: ఎస్పీ విజయారావు
సంగం వద్ద జరిగిన ప్రమాద ఘటనపై జిల్లా ఎస్పీ విజయారావు స్పందించారు. స్థానికుల సహకారంతో ఏడుగురిని కాపాడామని, గల్లంతైమన ఐదుగురి కోసం గాలిస్తున్నామని తెలిపారు. బోట్లు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఘటనా స్థలి వద్ద పోలీసులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.







