Andhra Pradesh: పుంగనూరులో పారిశ్రామిక వేత్త ఇంటిపై దాడి.. రాళ్లు, కర్రలతో అర్ధరాత్రి దుండగుల వీరంగం

Updated 5th December 2022 8:10 am

Andhra Pradesh: ఏపీ, చిత్తూరు జిల్లా, పుంగనూరులో ఆదివారం అర్ధరాత్రి కొందరు దుండగులు వీరంగం సృష్టించారు. పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై కొందరు దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు, ఫర్నీచర్‌తోపాటు ఆరు కార్లను ధ్వంసం చేశారు.

కాగా, ఘటన సమాచారం అందుకున్న పోలీసులు రామచంద్ర యాదవ్ ఇంటికి చేరుకుని లాఠీఛార్జి చేసి, నిందితుల్ని చెదరగొట్టారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి జరుగుతుంటే పోలీసులు అడ్డుకోలేదని ఆరోపించారు. ఈ దాడికి రాజకీయాలే కారణమని తెలుస్తోంది. అధికార వైసీపీకి చెందిన శ్రేణులే దాడికి పాల్పడ్డట్లు సమాచారం. పుంగనూరు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అయితే, ఈ నియోజకవర్గంలో రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై తలపెట్టిన ‘రైతు భేరి’కి అనుమతి లేదని ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సభ అధికార పార్టీకి వ్యతిరేకంగా జరుగోందని, వైసీపీ నేతలు అర్ధరాత్రి ఈ దాడికి పాల్పడ్డట్లు సమాచారం. ఈ దాడిలో దాదాపు 200 మంది పాల్గొన్నారని రామచంద్ర యాదవ్ అనుచరులు అంటున్నారు. పోలీసులతోపాటు అదనపు బలగాలు కూడా స్పందించడంతో ఈ దాడి ఆగింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us