జిల్లా కలెక్టర్ గా కార్తికేయ మిశ్రా

Updated 17th April 2017 Monday 11:00 PM

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా కార్తీకేయ మిశ్రా నియమితులయ్యారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఈయన జిల్లా కలెక్టర్ గా త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. 2009 ఐఏఎస్‌ బ్యాచ్‌కి చెందిన మిశ్రా బిట్స్‌పిలానీలో కంప్యూటర్‌ సైన్స్‌లో ఇంజినీరింగ్‌ చేశారు. ఈయన అహ్మాదాబాద్‌ ఐఐఎంలో ఎంబీఏ చదివారు. తరువాత ఉద్యోగం నిమిత్తం న్యూయార్క్‌లో రెండేళ్ల పాటు ఇన్వెస్ట్మెంట్ గోల్డ్‌స్కాచ్‌ సంస్థలో పని చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చాక సివిల్స్‌ రాసి 2009లో తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఈయన్ను ఏపీ క్యాడర్‌కు నియమించారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేటాయించగా ఏపీ కావాలని తిరిగి మన రాష్ట్రానికి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిజామాబాద్‌, విశాఖ సబ్‌ కలెక్టర్‌గా కూడా పని చేశారు. తరువాత తెలంగాణలో నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కు సీఎండీగా,  తరువాత ట్రాన్స్‌కో జేఎండీగా కూడా పనిచేశారు. ప్రస్తుతం పరిశ్రమల శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.  ఈయన తండ్రి మాజీ పీసీసీఎఫ్‌గా పనిచేసి ప్రస్తుతం బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు.  కార్తికేయ రాష్ట్రంలో చదివి ఏపీ ఇంటర్మీడియట్‌ బోర్డులో ర్యాంకర్‌గా నిలిచారు. తల్లి ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో మాజీ గ్రూప్‌-1 అధికారిణి, సోదరి, బావ ఇద్దరూ ఐఏఎస్‌లుగా ఉన్నారు. కార్తికేయ భార్య రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నారు. ఈయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us