AP politics : జనసేనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న పార్టీలు..దోస్తీ కోసం టీడీపీ, బీజేపీ ప్రయత్నాలు

UPDATED 6th MAY 2022 FRIDAY 10:50 AM

AP politics : ఓట్ బ్యాంక్ లేదు.. సీట్ షేరింగ్ లేదు.. స్టేట్‌లో పెద్దగా కేడర్ కూడా లేదు. ఆ పార్టీ పేరెత్తగానే.. ఠక్కున గుర్తొచ్చే ఇద్దరు లీడర్లు తప్ప.. చెప్పుకోవడానికి.. జనానికి చూపించడానికి నేమ్.. ఫేమ్.. ఉన్న నాయకులే లేరు. అయినా.. ఆ పార్టీ చాలా లక్కీ. విమర్శించడానికైనా.. జత కట్టడానికైనా.. మద్దతుకోసమైనా.. రాష్ట్రంలోని మిగతా పార్టీలకు.. ఆ పార్టీయే కావాలి. అదే.. జనసేన. డైరెక్ట్‌గానో.. ఇన్‌డైరెక్ట్‌గానో.. ఏపీలోని 3 పార్టీలు.. జనసేనకు సపోర్ట్ చేస్తున్నాయనే టాక్ మొదలైంది. మరి.. ఈ టైపు టాక్ ఎందుకు నడుస్తోంది. ప్రశ్నించడం కోసమే పుట్టిన జనసేన.. ఎవరిని ప్రశ్నించిందో.. ఎప్పుడు ప్రశ్నించిందోనన్న విషయాలను పక్కనబెడితే.. ఆ పార్టీ చాలా లక్కీ అనే టాక్ మాత్రం ఇప్పుడు వినిపిస్తోంది.

పాజిటివ్‌గానో.. నెగటివ్‌గానో.. ఏదో రకంగా.. ఈ ఒక్క పార్టీని.. మిగతా మూడు పార్టీలు మోసేస్తున్నాయ్. జనసేనను, ఆ పార్టీ నాయకులను ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తూ వస్తోంది అధికార వైసీపీ. దీంతో.. జనంలో జనసేనపై చర్చ సాగుతోంది. ఇక.. ఎప్పుడెప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుందామా? అని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఎదురుచూస్తోంది. ఇందుకోసం.. ఇన్ డైరెక్ట్‌గా జనసేనను సపోర్ట్ చేస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా.. టీడీపీ నేతలు జనసేనానికి ప్రత్యేకంగా పొగిడేస్తున్నారు. ఇక.. మరో పార్టీ బీజేపీ. వీళ్లైతే.. టైం దొరికినప్పుడల్లా.. జనసేన భజన చేసేస్తున్నారు. ఏపీలో జనసేనే నెంబర్ వన్ అని.. ఆకాశానికెత్తేస్తున్నారు. ఇలా.. అన్ని పార్టీలు.. జనసేనను ప్రమోట్ చేయడమంటే.. నిజంగా.. అది లక్కీ పార్టీయే అని రాజకీయవర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఏదో రకంగా.. జనంలోకి జనసేన పేరు వెళుతోందని చర్చించుకుంటున్నారు. నిజానికి.. ఏపీలో జనసేనకు పెద్దగా కేడర్ లేదు. గ్రామస్థాయి నుంచి నగరం దాకా.. చెప్పుకోదగ్గ లీడర్లు లేరు. బూత్ లెవెల్లోనూ.. పార్టీ అంత పటిష్టంగా ఏమీ లేదు. ఆ పార్టీకి ఉన్న ఏకైక బలం.. సామాజికపరమైన అంశమే. ఇదొక్కటే.. జనసేనకు.. సేనానికి.. జేజేలు కొట్టిస్తుందనే టాక్ వినిపిస్తోంది.

వైసీపీలో ఉన్న కాపు నేతలంతా.. దమ్ముంటే ఒంటరిగా పోటీ చేసి గెలవాలని జనసేనకు సవాళ్లు విసురుతున్నారు. ఎందుకంటే.. పవన్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తేనే వాళ్లకు లాభం కలుగుతుందనే అంచనాలున్నాయ్.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us