జర్నలిస్టుల సంక్షేమనికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

UPDATED 7th JANUARY 2018 SUNDAY 6:30 PM

పెద్దాపురం: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యాల వీరభద్రరావు(రాజబ్బాయి) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణం కొత్తసంత మార్కెట్ వద్ద ఎపిడబ్ల్యూజెఎఫ్ డివిజన్ కార్యదర్శి పలివెల రాజీవ్ ఆధ్వర్యంలో, డివిజన్ అధ్యక్షుడు ఎం.డి. అధికారి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన డివిజన్ స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా ఆయన హాజరై మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని, ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పత్రికలు పనిచేయాలన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందన్నారు. ఎన్.ఎ.జె జాతీయ కార్యదర్శి నవీన్ రాజ్ మాట్లాడుతూ పాత్రికేయులపై జరుగుతున్న దాడులు నివారించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనంతరం ఎన్.ఎ.జె జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన నవీన్ రాజ్ ను పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టి.ఎన్.ఎస్.ఎఫ్ ఉపాధ్యక్షుడు ముత్యాల మణికంఠ( చింటు), ఎపిడబ్ల్యూజెఎఫ్ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఎస్.కె. మున్నీ, జిల్లా కార్యదర్శి బంగార్రాజు, దాడులు కమిటీ సభ్యులు అల్లుమల్లు ఏలీయా, ఏపీబీజె జిల్లా అధ్యక్షుడు శ్రీధర్, నియోజకవర్గ అధ్యక్షుడు అలమండ రంగనాధస్వామి, గౌరవాధ్యక్షుడు సూర్యనారాయణ, డివిజన్ కార్యదర్శి కె. సురేంద్రబాబు, నియోజకవర్గ కార్యదర్శి కరెడ్ల రాజా, ఏపిబిజె జిల్లా మెంబర్ రామ్ లక్ష్మణ్, ఆకుల మురళి, లోవరెడ్డి, ఆనంద్, వీరబాబు, అశోక్, సుబ్బారావు, ప్రభుదాస్, సిద్దు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us