ఘనంగా ముస్లిం సోదరుల లైలతుల్ - ఖద్ర్ వేడుకలు

UPDATED 23rd JUNE 2017 FRIDAY 11:00 AM

పెద్దాపురం: స్థానిక షాహీ జామియా మస్జిద్ (పెద్ద మసీద్) వద్ద పవిత్ర రంజాన్ మాసంలో దివ్య గ్రంధం ఖురాన్ ఆవిర్భవించిన ఘనత కలిగిన రాత్రి లైలతుల్ - ఖద్ర్ ను ఘనంగా నిర్వహించారు. ఇషా నమాజ్ మొదలు తెల్లవారే ఫర్జ్ నమాజ్ వరకు పట్టణ ముస్లిం సోదరులు నమాజ్ లు ఆచరిస్తూ భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. మస్జిద్ ఇమాం అబ్దుల్ గఫ్ఫార్ ఖాన్, ఉత్తరప్రదేశ్ నుంచి విచ్చేసిన హఫీజ్ ఆలంగీర్ సాహెబ్ ఖురాన్ ప్రవచనాలను ముస్లిం సోదరులకు వినిపించారు. ముస్లిం అంజుమన్ వెల్ఫేర్ అసోసియేషన్, షాహీ జామియా మస్జిద్ కమిటీ ప్రెసిడెంట్ తన ప్రసంగంలో ఇస్లాం మత ప్రాముఖ్యత వివరిస్తూ, పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటూ, ముస్లింలకు విధిగా చేయబడిన జకాత్, ఫిత్రాలను రంజాన్ పండుగ ముందే నిరుపేద ముస్లింలకు చెల్లించవలసినదిగా ముస్లిం సోదరులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ ఆలీ బ్రదర్స్ , ఎస్.ఏ. నబి, జాకీర్, రిజ్వాన్, జలీల్, షబ్బీర్ హుస్సేన్, షేక్ రఫీ అధిక సంఖ్యలో యువ ముస్లిం సోదరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us