Updated 2nd May 2023 Tuesday 6:10 am
Annavaram: అన్నవరంలో కొలువైన శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామి దివ్యకల్యాణం సోమవారం రాత్రి 11.30 గంటలకు అంగరంగ వైభవంగా జరిగింది. ప్రత్యేకపూజలు అనంతరం రాత్రి 7గంటలకు సత్యదేవుడిని వెండిగరుడ వాహనంపై, అమ్మవారిని వెండి గజవాహనంపై ఆశీనులు గావించి గ్రామోత్సవం జరిపారు. రాత్రి 9గంటలకు వార్షిక కల్యాణవేదిక వద్దకు తోడ్కొనివచ్చారు. వేదికపై సత్యదేవ, అనంతలక్ష్మి అమ్మవార్లను, మరో వేదికపై పెండ్లి పెద్దలైన సీతారాములను ఆశీనులు గావించారు. సుముహుర్త వేళ స్వామి, అమ్మవారి శిరస్సుపై జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉంచారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామి అమ్మవారి మెడలో మూడుముళ్లు వేశారు.







