ప్రతీ పేదవాడికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం:డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్

గంగవరం, 11 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్) : పార్టీలకు, కులాలకు అతీతంగా ప్రతీ పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ (బాబు), రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీడీవో జాన్ మిల్టన్ అధ్యక్షతన మండలంలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై గ్రామ పంచాయితీల వారీగా ఎమ్మెల్యే ధనలక్ష్మి, అనంతబాబు గురువారం సమీక్ష నిర్వహించి సంతృప్తిని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేస్తుందని, ప్రతీ ప్రభుత్వ పథకంపై ప్రజలకు వివరించాలన్నారు. ఇక నుంచి ఏ గ్రామ సమస్య ఆ గ్రామంలోనే పరిష్కారం కావాలనే లక్ష్యంగా గ్రామ సచివాలయ, గ్రామవలంటరీ వ్యవస్థను సీఎం ఏర్పాటు చేశారన్నారు. గామ సచివాలయాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు అమలులో ఆన్లైన్ ఇబ్బందులు ఉన్నాయని వీటిని పరిష్కరిస్తామన్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎమ్మెల్యే ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రతిభ ఆధారంగా యువతకు ఎంతో పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని అన్నారు. అన్ని వర్గాల వారీని అందరించే పనులను చేస్తున్నారన్నారు. పథకాల అమలులో గ్రామ సచివాలయ సిబ్బంది కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా పంచాయితీల వారీగా అభివృద్ధిని సమీక్షిస్తూ ప్రజలు, పార్టీనేతలు తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి అనంత బాబు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనేక గ్రామాల్లో మందినీటి పథకాలు నిర్మాణానికి, రహదార్లు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ భవనాలు, పాఠశాల భవనాలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామ సచివాలయ కార్యదర్శులుకు ప్రభుత్వం మంజూరు చేసిన సెల్ ఫోన్లును అనంతబాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల సీఐ రవికుమార్, తహసీల్దార్ ఎం.వీర్రాజు, ఎస్సై షరీఫ్, డిప్యూటీ తహశీల్దార్ రామకృష్ణ, మల్లేశ్వరరావు, ఎఈలు అబ్బాయిదొర, రమణ, వ్యవసాయాధికారి సరళ, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ అప్పలరాజు, ఇన్ ఛార్జీ రఘు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కె.ఎస్.ప్రభాకర్, కుంజం లక్ష్మి, మాజీ సర్పంచ్ లు అక్కమ్మ నాగేశ్వరరావు, మొల్లేరు సొసైటీ పర్సన్ ఇన్ ఛార్జ్ టి.తిరుపతిరావు, పలు శాఖల అధికారులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, వలంటీర్లు పాల్గొన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us