కొవ్వూరు (రెడ్ బీ న్యూస్) 2 జనవరి 2022 : సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వ జోక్యం తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని ఆదాయ వనరుగా చేసుకొని వైసీపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో ఆయన సోము వీర్రాజు ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రం నిధులిస్తే జగన్ సొంత పథకాలుగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తాం. ప్రభుత్వ వైఫల్యాలపై భాజపా తరఫున మండలస్థాయి భేటీలు నిర్వహిస్తాం’’ అని సోము వీర్రాజు వివరించారు.







