ఆదిత్య ప్రొఫెసర్ ఆస్థాశర్మ ప్రతిభ

UPDATED 1st NOVEMBER 2017 WEDNESDAY 7:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్ ఆస్ధాశర్మ విశేష ప్రతిభ కనబరిచినట్లు కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆధునిక సమాజంలో జరుగుతున్న సమస్యలపై "ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ స్మాల్ ఫ్యామిలీ బిజినెసెస్" అనే అంశంపై  రచించిన పుస్తకానికి భారతదేశంలో గుర్తింపు పొందిన ఎక్సెల్ ఇండియా పబ్లికేషన్స్ మార్కెట్ లోకి విడుదల చేసినట్లు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై చిన్న, మధ్య తరహా పరిశ్రమల యొక్క పాత్ర ఎంతో కీలకమని ఈ పుస్తకం ద్వారా ఆమె సమాజానికి వివరించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని రచనల ద్వారా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆస్ధాశర్మకు బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందనలు తెలియచేశారు.     

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us