Pawan Kalyan Meets PM Modi : ప్రధాని మోదీతో పవన్ భేటీ.. తాజా రాజకీయ పరిణామాలు, కలిసి పనిచేయడంపై చర్చ

UPDATED 11th NOVEMBER 2022 FRIDAY 9:20 PM

Pawan Kalyan Meets PM Modi : ఐఎన్ఎస్ చోళలో ప్రధాని మోదీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. రెండు పార్టీలు కలిసి పని చేయడంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. వర్షం కారణంగా ఆయన ప్రయాణిస్తున్న విమానం మధురై నుంచి విశాఖకు ఆలస్యంగా చేరుకుంది. ఎయిర్ పోర్టు నుంచి ప్రధాని మోదీ ఐఎన్ఎస్ డేగకు చేరుకోగా.. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలికారు.

ప్రధాని మోదీ పర్యటనతో విశాఖలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 6వేల 700 మంది పోలీసులతో పహారా కాస్తున్నారు. శనివారం విశాఖ నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విశాఖ నగర వ్యాప్తంగా సెక్షన్ 30 అమలు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us