ప్రజాస్వామ్యంలో పత్రికలదే కీలక పాత్ర

UPDATED 17th AUGUST 2017 THURSDAY 2:00 PM

పెద్దాపురం: ప్రజాస్వామ్యంలో పత్రికలదే కీలక పాత్రని ఎంపిపి గుడాల రమేష్ అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో గురువారం ఎపియూడబ్ల్యుజె వజ్రోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా సీనియర్ పాత్రికేయుడు అడపా వెంకట్రావు ఎపియూ డబ్ల్యుజె పతాకాన్ని ఆవిష్కరించి జాతిపిత మాహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పత్రికాస్వేచ్ఛను కాపాడాలంటూ గాంధీజీకి వినతి పత్రం అందచేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన ఎంపిపి మాట్లాడుతూ ప్రజాసమస్యల పరిష్కారంలో విలేఖరులు గురుతరమైన భాద్యత వహించాలన్నారు. సమాజంపై పూర్తి స్థాయి అవగాహన విలేఖరుల ప్రత్యేకతన్నారు. విలేఖరులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తమ వంతు సహాకారం అందిస్తామన్నారు. ఎపియూడబ్ల్యుజె సంఘటిత శక్తిగా ఆవిర్భవించి వజ్రోత్సవాలు జరుపుకోవడం హర్షణీయమన్నారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు రెడ్డిపల్లి రమణమూర్తి( బుల్లియ్య), రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు, జిల్లా జాయింట్ సెక్రటరీ మాసా చంద్ర రావు(చందు) మాట్లాడుతూ యూనియన్ ఆవిర్భావం నుంచి సాధించిన విజయాలను వివరించారు. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాలన్నారు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాల్సిన భాద్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎపియూ డబ్ల్యుజె సభ్యులు పి. వీరభద్రవర్మ, సుబ్రహ్మణ్యం(సుబ్బు), మల్లేష్, విజయ్, చంద్రదాస్, రాజా, ఆకుల మురళీకృష్ణ, బూరాడ శ్రీనివాసరావు, గంజి కృష్ణ, వినాయక్, ఆలీ, సుధాకర్, గూనాపు విజయ్, చవ్వాకుల ఈశ్వరావు, ఆనంద్, శ్రీకాంత్, సారధి, సాయి, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us