Vadapalli: వైభవంగా వెంకటేశ్వరుడి తెప్పొత్సవం

Updated 5th April 2023 Thursday 9:10 pm

Vadapalli: వేంకటేశా.. ఆపదమొక్కులవాడా.. అడుగడుగు దండాలవాడా.. గోవిందా అంటూ అశేష భక్తజనం భక్తి పారవశ్యం, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వాడపల్లి (Konaseema Thirumala) వేంకటేశ్వరుని తెప్పోత్సవం బుధవారం స్థానిక గౌతమి
గోదావరిలో హంస వాహనంపై కనుల పండువగా జరిగింది. గోదారమ్మ చల్లని కెరటాలు తీరాన్ని తాకుతుండగా ఆహ్లాదకర వాతావరణంలో శ్రీవారు నదిలో విహరిస్తూ అభయ ప్రదానం చేశారు. ఈ ఘట్టం భక్తజన మదిలో ఆనంద మకరందాన్ని నింపింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాణ సంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చెంతనే ఏర్పాటైన నృత్యరూపకాలు అలరించాయి. 
ల్యాణ మూర్తులకు దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఉమాదేవి, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంపతుల పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాల్లో భాగంగాur గురువారం మహాపూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us