UPDATED 2nd MARCH 2022 WEDNESDAY 04:00 PM
KTR Launching of ghmc sanitation vehicles : నగరంలోని పీపుల్స్ ప్లాజా వద్ద చెత్త తరలించే 40 అత్యాధునిక వాహనాలను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలను కాంకీ సంస్థ ఏర్పాటు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు తరలిస్తాయి ఈ వాహనాలు. చెత్త తరలించే అత్యాధునిక వాహనాలకు ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఏ నగరంలో అయినా రెండు ముఖ్యమైన వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి.
సాలిడ్, లిక్విడ్ వేస్ట్ ఉంటాయి. స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు పరిష్కారాలు వెతుకుతున్నామని తెలిపారు. 2014లో 2500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తే.. ప్రస్తుతం 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నాం. 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆటోలను చెత్త సేకరణకు ఉపయోగిస్తున్నాం. త్వరలోనే మరో 400 ఆటోలు నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. 150 డివిజన్లలో డోర్ టు డోర్ కలెక్షన్‌కు వినియోగిస్తామని అన్నారు.
విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలంటే ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనీ..హైదరాబాద్ నగర ప్రజలకు ఎటువంటి దుర్గంధం వెదజల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 95 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్‌ఫర్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.







