UPDATED 11th DECEMBER 2017 MONDAY 6:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ బిబిఎ విద్యార్థిని పి.సుజన వక్తృత్వ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి ప్రథమ బహుమతి గెలుపొందినట్లు డైరెక్టర్ డాక్టర్ ఎన్.సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సుగుణారెడ్డి మాట్లాడుతూ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఆధ్వర్యంలో సామర్లకోట వై.ఆర్.ఎల్. డిగ్రీ కళాశాల "లీగల్ రైట్స్ ఫర్ విమెన్" అను అంశంపై నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో ప్రథమస్థానం కైవసం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. తమ కళాశాల విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, ఇటువంటి పోటీల్లో పాల్గొనడం ద్వారా ఇతర కళాశాలల విద్యార్థులతో అభిప్రాయాలను, ఆలోచనలను పరస్పరం పంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, అధ్యాపక సిబ్బంది, తదితరులు విద్యార్థినిని అభినందించారు.







