Updated 1st May 2017 Monday 2:30 PM
కాకినాడ : జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయ సూపరెంటెండెంట్ ఎం.బాలామణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెపై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ నిర్వహించి, చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హోదాను అడ్డుపెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా పంచాయతీ అధికారితో ప్రాథమిక విచారణ నిర్వహించారు. డీపీవో కుమార్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.







