UPDATED 3 FEBRUARY 2022 THURSDAY 08:50 PM
హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్): తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2వేల 421 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో చనిపోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వైరస్ సోకిన వారి సంఖ్య 7,71,828కి పెరిగింది. మొత్తం మరణించిన వారి సంఖ్య 4,096కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 33వేల 104 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 95.18గా ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 649 మందికి పాజిటివ్‌గా తేలింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 81వేల 417 కరోనా టెస్టులు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది.







