AP Cabinet Decisions : కోనసీమ జిల్లా పేరు మార్పు, 27న ఖాతాల్లోకి డబ్బులు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

UPDATED 24th JUNE 2022 FRIDAY 10:25 PM

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. రెండున్నర గంటలపాటు జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్పు చేయడానికి కేబినెట్ ఆమోదించింది.

కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఆర్సీ జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గ ఓకే చెప్పింది. ఇక ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

▪️ అర్జున్ అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్-1 ప్రభుత్వ ఉద్యోగం

▪️ దీనికి అవసరమైన చట్టాన్ని సవరించాలని నిర్ణయం

▪️ వచ్చే నెలలో అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలకు క్యాబినెట్ ఆమోదముద్ర

▪️ జగనన్న విద్యా కానుక, కాపు నేస్తం, జగనన్నతోడు, వాహనమిత్ర పథకాలకు ఆమోద ముద్ర

▪️ వంశధార నిర్వాసితుల 216 కోట్ల రూపాయల పరిహారం విడుదల చేయాలని క్యాబినెట్ ఆమోదం

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us