UPDATED 20th SEPTEMBER 2017 WEDNESDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ లో ఈ నెల 11 నుంచి 19 వరకు నిర్వహించిన CATIA వర్క్ షాప్ బుధవారంతో ఘనంగా ముగిసినట్లు కళాశాల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు, నాల్గవ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చే ఈ వర్క్ షాప్ నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు మాట్లాడుతూ విద్యార్థుల్లో నైపుణ్యాల అభివృద్ధికోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన సంస్థను నెలకొల్పి నిష్ణాతులైన ప్రముఖులచే ఇటువంటి వర్క్ షాప్ లు నిర్వహిస్తూ విద్యార్థులు ఆయా రంగాల్లో జరిగే నూతన ఆవిష్కరణలు విజ్ఞాన, అభివృద్ధిని అందిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. విద్యార్థులు ఈ విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రిసోర్సు పర్సన్స్ గా సీనియర్ ట్రైనర్ నందిని, జూనియర్ ట్రైనర్ నవీన్, తదితరులు పాల్గొన్నారు.







