టిటిడిసిలో మహిళా సమాఖ్య సమావేశం

UPDATED 7th MAY 2018 MONDAY 9:00 PM

సామర్లకోట: మహిళా సమాఖ్యల సభ్యుల సమావేశం స్థానిక టిటిడిసిలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రాజెక్టు మేనేజర్ డి. రత్నాకర్ హాజరైనారు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల సమైక్య పనితీరు, స్త్రీ నిధి బకాయిలను పూర్తి స్థాయిలో వసూలు చేయాలని, రికవరీ శాతం పెంచాలన్నారు. సకాలంలో రుణాలు చెల్లించనివారికి కొత్త రుణాలు ఇవ్వడం జరగదని, చాలా చోట్ల రుణాలు రికవరీ శాతం తగ్గిందని అన్నారు. సకాలంలో రుణాలను చెల్లిస్తే తిరిగి వారికి కొత్త రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని, దీని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు నాగదేవి, కార్యదర్శి బి. భవాని, కోశాధికారి ఎం. లలిత, జిల్లా సమాఖ్య మేనేజర్ శేషగిరి, ఎపిఎం ఐబి ఎంవిఎల్ కుమారి, వివిధ మండలాల మహిళా సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us