UPDATED 3rd MAY 2017 SATURDAY 6:00 PM
గండేపల్లి: గోదావరి అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (గుడా) ఛైర్మన్ గా ఎంపికైన గన్ని కృష్ణకు ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఘన స్వాగతం పలికి గజమాలతో ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆదిత్య విద్యా సంస్థల ఛైర్మన్ శేషారెడ్డి మాట్లాడుతూ పార్టీకి ఆయన అందించిన సేవలే గుర్తింపునిచ్చాయని కొనియాడారు. అనంతరం ఆయనను ఆలింగనం చేసుకుని ఆత్మీయంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఆదిత్య కళాశాల సిబ్బంది పాల్గొన్నారు







