UPDATED 28th FEBRUARY 2022 MONDAY 05:00 PM
TDP Senior Leader Yadlapati Venkatarao : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన కుమార్తె నివాసంలో తుదిశ్వాస విడిచారు. 103 ఏళ్ల వెంకట్రావు కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. యడ్లపాటి మాజీ మంత్రిగాను, సంఘం డైరీ వ్యవస్థాపుకులుగా, గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్, రాజ్యసభ్య సభ్యునిగా పనిచేశారు. యడ్లపాటి వెంకట్రావు 1919 డిసెంబర్ 16న గుంటూరు జిల్లా బోడపాడులో జన్మించారు. ఆయన ప్రముఖ రైతు ఎన్.జి.రంగా ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. ఎన్.జి. రంగాతో కలిసి 1951లో కృషీకార్ లోక్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించారు.







