ఛలో విజయవాడకు తరలిన పాత్రికేయులు

Updated 8th April, 2017, Saturday, 7:00AM

పెద్దాపురం: పాత్రికేయుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే ) రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పెద్దాపురం నుంచి రెండు వాహనాలలో పాత్రికేయులు శనివారం విజయవాడ తరలి వెళ్లారు. ఏపీయూడబ్ల్యూజే  రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు రాకుర్తి రాంబాబు ఆధ్వర్యంలో ఈ సదస్సుకు తరలి వెళ్లారు. ఈ సందర్భం గా రాంబాబు మాట్లాడుతూ  పాత్రికేయుల హక్కుల సాధనకు, భద్రత, సంక్షేమము,ఎదుర్కొంటున్న సమస్యలు మొదలైన విషయాలపై ఈ సదస్సులో  చర్చించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ సదస్సుకు సీనియర్  సంపాదకుడు రాఘవాచారి, ఏపీయూడబ్ల్యూజే ప్రెసిడెంట్ నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి ఐ.వి సుబ్బారావు తదితర ప్రముఖులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు మాసా చందు,ఆకుల మురళీకృష్ణ ,బూరాడ శ్రీనివాసరావు,వినాయక్, చవ్వాకుల ఈశ్వరరావు, వర్మ, వెంకట్, అలాగే పెద్దాపురం డివిజన్ పరిధిలోని తుని, జగ్గంపేట, గండేపల్లి, ఏలేశ్వరం, రంగంపేట, తదితర మండలాల నుంచి భారీ సంఖ్యలో పాత్రికేయులు తరలి వెళ్లారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us