Sri Reddy: ‘క్షమించండి అంజనమ్మ’.. చిరంజీవి తల్లిపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు..

UPDATED 23 JANUARY 2022 SUNDAY 12:00 PM

REDBEENEWS

టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో రచ్చ చేసి, మీడియా ముందుకి వచ్చి ఒక్కసారిగా పాపులర్ అయిన ఆర్టిస్ట్ శ్రీరెడ్డి. అప్పట్లో ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫిలిం ఛాంబర్ ముందు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ కి బాధితులైన ఆడవాళ్ళకి న్యాయం చేయాలి అంటూ గొడవ చేస్తూ సినీ ప్రముఖులందర్నీ తిట్టింది. ఇందులో భాగంగా చిరంజీవి తల్లిని కూడా అన్నారని మాటలు అంది. ఇది జరిగి చాలానే సంవత్సరాలైంది. తాజాగా మరోసారి ఈ విషయంపై మాట్లాడింది శ్రీరెడ్డి. నిన్న శ్రీరెడ్డి ఈ విషయంపై ఓ వీడియో చేసి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో.. ”ఆడవాళ్ల కోసం నేను చేసిన ఉద్యమంలో న్యాయం కోసం ఓ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తే ఆయన నా బ్రెయిన్ వాష్ చేసి ఆయన ఇచ్చిన సలహాతో చిరంజీవి గారి అమ్మ అంజనమ్మని తిట్టాల్సి వచ్చింది. ఈ ఇష్యూతో ఏమాత్రం సంబంధం లేని ఆవిడ్ని తిట్టడం ముమ్మాటికీ తప్పే. దానికి నేను శిక్ష కూడా అనుభవించాను. సోషల్‌ మీడియాలో కూడా చాలా ట్రోల్స్‌ ఎదుర్కొన్నాను. ఈ విషయంలో నేను ఇప్పటికీ బాధపడుతున్నాను. అన్యాయంగా ఆమెను తిట్టడం తప్పే. ఒప్పుకుంటున్నాను. నేను తప్పుచేశాను. బుద్ది గడ్డి తిని అలా తిట్టాను. పెద్ద మనసు చేసుకొని నన్ను క్షమించండి అంజనమ్మా’ అంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us