ఘనంగా గ్రామదేవతల జాతర

UPDATED 25th MAY 2017 THURSDAY 5:00 PM

పెద్దాపురం: పెద్దాపురం మండల పరిధిలో పలు గ్రామాల్లో గ్రామదేవతల జాతర మహోత్సవాలు గురువారం ఘనంగా జరిగాయి. దీనిలో భాగంగా కట్టమూరు పోలేరమ్మ, వడ్లమూరు చింతాలమ్మ, గుడివాడ పచ్చాలమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. జాతర మహోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. డప్పు వాయిద్యాలు, గరగల నృత్యాలు, పెద్ద పులి ఆటలు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us