UPDATED 19th SEPTEMBER 2017 TUESDAY 7:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సిస్కో నెట్ వర్కింగ్ అకాడమీ ఆసియా, పసిఫిక్, జపాన్ -2017 ఐటి ఎస్సెన్షియల్స్ విభాగం నిర్వహించిన పరీక్షల్లో తమ కళాశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా లెవెల్ లో మొదటి పది స్థానాల్లో ఆరు స్థానాలు, మొదటి 20 స్థానాల్లో పది స్థానాలను కైవసం చేసుకున్నారని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. ఆల్ ఇండియా లెవెల్ లో మౌబోల్ అబిఎం అకీన్ ఫస్ట్ ర్యాంక్, మేడిశెట్టి ప్రసాద్ రెండవ ర్యాంక్, శ్రీ మాధురి దరిశిపూడి నాల్గవ ర్యాంక్, గంగాభవాని ఏడవ ర్యాంక్, శ్రీ ప్రణవి ఎనిమిదవ ర్యాంక్, ఎస్.సూర్య తేజ తొమ్మిదవ ర్యాంక్, అలాగే ఆసియా, పసిఫిక్, జపాన్ స్థాయిలో 24 , 47 , 82 స్థానాలు కైవసం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. సిస్కో నెట్ వర్కింగ్ అకాడమీ, ఆదిత్య టెక్నికల్ హబ్ సౌజన్యంతో నిర్వహించిన ఈ పరీక్షల్లో ఆల్ ఇండియా స్థాయి ర్యాంకులతో కళాశాల పేరు ప్రతిష్టలను పెంపొందించిన విద్యార్థులను, టెక్నికల్ హబ్ సిఈవో నీలం బాబ్జి, పోలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్ లను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అభినందించారు.







