AP News: తిరుపతిలో అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు అనుమతి

అమరావతి (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈ నెల 17న అమరావతి రైతుల బహిరంగ సభకు హైకోర్టు అనుమతి లభించింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభ నిర్వహించుకోవాలని తెలిపింది. కరోనా నిబంధనలు పాటిస్తూ సభ నిర్వహించుకోవాలని రైతులకు సూచించింది. రాయలసీమ ఐక్య వేదిక సభ మర్నాడు నిర్వహించుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర నిన్న అలిపిరి శ్రీవారి పాదాల చెంత ముగిసింది. పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో బహిరంగ సభ నిర్వహించాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. అయితే తిరుపతి పోలీసులు నుంచి సభ నిర్వహణకు అనుమతి రాకపోవడంతో అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఇవాళ బహిరంగ సభకు అనుమతి ఇచ్చింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us