శామీర్‌పేట (రెడ్ బీ న్యూస్) 19 డిసెంబర్ 2021: రాజీవ్ రహదారిపై రక్షణ శాఖకు చెందిన వాహనం ఏడు కార్లను ఢీకొట్టిన ఘటన శామీర్‌పేట ఠాణా పరిధిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మేడ్చల్ జిల్లా తూంకుంట పుర పరిధి రాజీవ్ రహదారి అలంక్రిత రిసార్టు సమీపంలో నగరం వైపు నుంచి వస్తున్న ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు రోడ్డుపై ప్రయాణిస్తున్న ఏడు కార్లను ఢీకొట్టింది. మూడు వాహనాలు బాగా దెబ్బతిన్నాయి. మరో నాలుగు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అరగంట పాటు వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.







