రూ.1600 కోట్ల వ్యయంతో గోదావరి జలాలను ఏలేరుతో అనుసంధానం

* ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప
* రూ.60 లక్షలు నిధులతో గోరింట- మల్లాం తారురోడ్డుకు మంత్రి శంకుస్థాపన

UPDATED 8th OCTOBER 2018 MONDAY 6:00 PM

పెద్దాపురం: రైతాంగానికి పురుషోత్తపట్నం ద్వారా రెండవ పంటకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. పెద్దాపురం మండలం గోరింట గ్రామంలో పి.ఆర్&ఆర్.వో రూ.60 లక్షలు నిధులతో గోరింట నుంచి మల్లాం వరకు నిర్మిస్తున్న తారురోడ్డుకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రామాలయం వద్ద ఎంపిడివో  పల్లాబత్తుల వసంతమాధవి అధ్యక్షతన గ్రామదర్శిని-గ్రామసభ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతాంగానికి పుష్కలంగా నీరు అందించాలనే ఉద్దేశ్యంతో రు.1600 కోట్లుతో గోదావరి జలాలను ఏలేరు నదిలో అనుసంధానం చేయడం ద్వారా రైతాంగానికి పుష్కలంగా రెండవ పంటకు కూడా  నీరందిస్తామని అన్నారు. గ్రామంలో మౌలిక వసతులు కల్పనలో భాగంగా గోరింట-మల్లాం రోడ్డు సమస్య తీర్చడానికి రూ.60 లక్షలతో ఈ రోజు పనులకు శ్రీకారం చుట్టామన్నారు. రూ.2 కోట్లతో గత 4 సంవత్సరాల్లో గోరింట గ్రామంలో  అభివృద్ధి పనులు చేశామని, అంగన్వాడీ భవనం, పంచాయతీ కార్యాలయం, సిసి రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ గ్రామంలో ప్రధాన సమస్య డ్రైనేజి అని దీనిని కూడా నూరుశాతం పూర్తి చేస్తామన్నారు. అర్హులైన పేదలకు ఇళ్ళ స్థలాలు కేటాయించడానికి రైతులు ముందుకు వస్తే ఎకరానికి రూ.30 లక్షలు చొప్పున ఐదు ఎకరాలు కొనుగోలు చేస్తామని, కాలనీకి రైతు పేరు పెడతామని తెలిపారు. గ్రామంలో యువత క్రమశిక్షణతో, ఐకమత్యంతో మొక్కలు నాటే కార్యక్రమంలో చురుకుగా పనిచేస్తున్నారని వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ పనులు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు, హాస్టల్స్ నిర్వహణ, ప్రభుత్వ వైద్య సేవలు, ప్రకృతి వ్యవసాయం, తదితర శాఖల వివరాల గురించి సంబంధిత అధికారులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గాయత్రి, పంచాయతీ రాజ్ డిఇ హరినాధరావు, నీటిసంఘం డైరెక్టర్ పచ్చిపాల యేసు, సొసైటీ డైరెక్టరు పచ్చిపాల దొరబాబు, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ పచ్చిపాల సత్తిబాబు, పచ్చిపాల సతీష్, తుమ్మలరాజా, కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us