Updated 25th April 2017 Tuesday 12:20 PM
జగ్గంపేట: స్థానిక గెద్ద పేట సంతమార్కెట్ వీధిలో రాజమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈ నెల 26 న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటి సభ్యులు తెలిపారు. ఈ జాతర మహోత్సవాలలో భాగంగా గరగల నృత్యాలు, తీన్ మార్, శక్తివేషాలు, కళ్ళు మిరుమిట్లు గొలిపే బాణాసంచా, మొదలైన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కమిటి సభ్యులు పేర్కొన్నారు. ఐదు రోజులు పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయని కమిటి సభ్యులు పేర్కొన్నారు. అలాగే భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ జాతర మహోత్సవాలకు ముఖ్య అతిధులుగా కాకినాడ ఎంపి తోట నరసింహం, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులు నెహ్రూ, ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ జ్యోతుల చంటిబాబు తదితరులు హాజరవుతారని, అధిక సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కమిటి సభ్యులు కోరారు.







