UPDATED 28th NOVEMBER 2018 WEDNESDAY 6:30 PM
పెద్దాపురం: స్వచ్చభారత్, స్వచ్చఆంధ్రప్రదేశ్ సాధించడానికి ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సెంట్రల్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ షఫీ మహమ్మద్ అధ్యక్షతన స్థానిక మరిడమ్మ అమ్మవారి కాలక్షేప మండపంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన పీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో (కాకినాడ) ఆధ్వర్యంలో స్వచ్చతా యాక్షన్ ప్లాన్ పై ప్రత్యేక అవగాహనా కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం మాట్లాడుతూ స్వచ్చభారత్, స్వచ్చఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రజలందరి సహకారంతో సాధించవచ్చని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్చఆంధ్రప్రదేశ్ కోసం స్వచ్చకమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో కార్పొరేషన్లు, పట్టణాలు, గ్రామాల పరిశుభ్రతకు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెత్తను సేకరించి దాని నుంచి సంపద తయారు చేయడానికి గ్రామాల్లో సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, స్వచ్చత వల్ల ప్రజల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. స్వచ్చతపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన ఈ అవగాహనా కార్యక్రమాలు ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగి స్వచ్ఛభారత్, స్వచ్చఆంధ్రప్రదేశ్ సహకరించాలని అన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు మాట్లాడుతూ స్వచ్చభారత్, స్వచ్చఆంధ్రప్రదేశ్ లో భాగంగా పెద్దాపురం మున్సిపాల్టీకి రాష్ట్రంలో 4వ స్థానం, దక్షిణాది రాష్ట్రాల్లో 455 మున్సిపాల్టీలలో పెద్దాపురం మున్సిపాల్టీకి 41వ స్థానం లభించిందని, భవిష్యత్తులో ప్రధమ స్థానం సాధించాలని అన్నారు. అనంతరం కళాకారులచే ఏర్పాటు చేసిన స్వచ్చభారత్ గేయం, వీధి నాటకాన్నిమంత్రి ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు, తహశీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, సిడిపివో ఆదుర్తి విజయలక్ష్మీ, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతికరాజు, అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







