ఓటీఎస్‌పై దుష్ప్రచారం చేస్తే చర్యలు : సీయం జగన్

అమరావతి (రెడ్ బీ న్యూస్) 2 డిసెంబర్ 2021: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వన్‌ టైం సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌)పై జరుగుతున్న దుష్ప్రచారంపై కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దుష్ప్రచారానికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ‘ఈ పథకం ద్వారా లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుంది. చట్టపరంగా హక్కులు దఖలు పడతాయి. ఇంతలా మేలు చేసే పథకంపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి. లబ్ధిదారుల్లో సందేహాలు, అనుమానాలు ఉంటే అధికారులు అవగాహన కల్పించాలి. పథకం వల్ల కలిగే మేలు లబ్ధిదారులకు చూపించాలి’ అని వివరించారు. సీఎంవో అధికారులతో సమావేశమై ఈ మేరకు ఆదేశాలిచ్చారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us