UPDATED 2nd JULY 2017 SUNDAY 8:00 PM
విజయవాడ : కనకదుర్గమ్మ అమ్మవారికి తెలంగాణ భక్తులు బోనాలు సమర్పించారు. తెలంగాణకు చెందిన భక్తులు బోనాల పండుగ సందర్భంగా విజయవాడకు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ప్రారంభం కావడంతో ఈరోజు దుర్గమ్మకు బోనం తీసుకొని విజయవాడకు వచ్చారు. సంప్రదాయ పద్దతిలో అమ్మవారికి బోనంతో పాటు పట్టువస్త్రాలు, పసుపుకుంకుమ, గాజులు సమర్పించారు. ముందుగా దుర్గగుడి దిగువన జమ్మిచెట్టు వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విచిత్ర వేషధారణలు, అమ్మవారి బోనం ఎత్తుకొని మహిళలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.







