Konaseema Thirumala Vadapalli : వైభవంగా స్వామివారి చక్రస్నానం

UPDATED 22nd OCTOBER 2022 SATURDAY 10:10 PM

▪️ వేద పండితులచే మహాపూర్ణాహుతి.. మహదాశీర్వచనం

▪️ రాత్రి స్వామివారికి పవళింపు సేవ.. పోటెత్తిన భక్తజనం

▪️ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గిరెడ్డి దంపతులు, దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు దంపతులు

▪️ ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Konaseema Thirumala Vadapalli : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవ యజ్ఞసమాప్తికి చిహ్నంగా శనివారం చక్రస్నానం ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. చక్రత్తాళ్వార్లకు స్నానం నిర్వహించే ముందు మహాశాంతి హోమం, మహాపూర్ణాహుతి, నవమూర్తి ఆవాహన తదితర కార్యక్రమాలు జరిపారు.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి సరసన చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. ఈనెల 14న ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాలు చక్రస్నానం అనంతరం ధ్వజావరోహణతో ముగిశాయి.

పండితులు ఖండవిల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు నేతృత్వంలో అర్చకస్వాములు వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు చేశారు. ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి, దేవాదాయశాఖ ఉప కమిషనర్ విజయరాజు, పాలకమండలి ఛైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఉమాదేవి దంపతులు, ఈవో ముదునూరి సత్యనారాయణరాజు, హైమాపార్వతి దంపతులు, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us