UPDATED 17th NOVEMBER 2022 THURSDAY 10:15 PM
Puri Jagannadh: టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, నటి కమ్ నిర్మాత ఛార్మి కౌర్ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలో టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారంలోనూ వీరిద్దరి పేర్లు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా వీరిద్దరు కలిసి నిర్మించిన ‘లైగర్’ మూవీ వీరికి సరికొత్త తలనొప్పిని తెచ్చిపెట్టింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కి.. ప్రేక్షకులను మెప్పించడంలో ఘోరంగా విఫలమయ్యింది.
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన నగదు లావాదేవీలపై ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. ఈ సినిమా కోసం జరిగిన నగదు లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు, ఫెమా నిబంధనల ఉల్లంఘనపై పలు ఆధారాలను సేకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమాలో రాజకీయ నేతల పెట్టుబడులు ఉన్నట్లుగా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై 15 రోజుల క్రితమే పూరికి ఈడీ నోటీసులు ఇవ్వగా, కొద్దిసేపటి క్రితం ఛార్మితో కలిసి పూరి ఈడి కార్యాలయానికి చేరుకున్నారు.







