HIT 2: అడివి శేష్‌కి ‘హిట్’ ఇచ్చేందుకు వస్తున్న జక్కన్న!

UPDATED 27th NOVEMBER 2022 9:30 AM

HIT 2: టాలీవుడ్‌లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్-2’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరో అడివి శేష్ నటిస్తుండగా, దర్శకుడు శైలేష్ కొలను ఈ సినిమాను పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నవంబర్ 28న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. అయితే ఈ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు వస్తారా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కాగా, దీనికి సమాధానాన్ని ఓ పోస్టర్ రూపంలో చిత్ర యూనిట్ తెలిపింది. హిట్-2 చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుధీరుడు ఎస్ఎస్.రాజమౌళి రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

దీంతో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌పై సైతం చిత్ర వర్గాల్లో అదిరిపోయే క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమాను నాని హోమ్ బ్యానర్ వాల్‌పోస్టర్ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us