కడియం (రెడ్ బీ న్యూస్) 1 డిసెంబర్ 2021: కడియంలోని పల్ల వెంకన్న నర్సరీలో మంగళవారం ప్రముఖ నటుడు అలీ, నటి కరుణా భూషన్‌లతో నృత్యాన్ని చిత్రీకరించారు. నరేశ్, సునీల్‌తోపాటు తనికెళ్ల భరణి, బ్రహ్మానందం తారాగణంగా పూర్తి హాస్యభరితంగా ఉంటుందని దర్శకుడు అశోక్‌కుమార్ తెలిపారు. ఈ చిత్రానికి ‘కోతిబావకు పెళ్లంటా’ టైటిల్‌ను ఖరారు చేసినట్లు చెప్పారు. దివంగత రైతు పల్ల వెంకన్నపై విడుదల చేసిన పుస్తకాన్ని నర్సరీ రైతులు పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల సత్తిబాబు అలీకి అందజేశారు. ● సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి అత్యంత బాధాకరమని అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.







